రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రపంచ వ్యాప్తంగా హీరో గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఈ సంవత్సరం రాధే శ్యామ్ అనే మూవీbతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో తెరకెక్కిన రాధే శ్యామ్ మూవీ లో అందాల ముద్దు గుమ్మ పూజ హెగ్డే రెబల్ స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని యువి క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో  చాలా గ్రాండ్ గా పాన్ ఇండియా మూవీ గా రూపొందించారు. అలా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ ని కొంత కాలం క్రితమే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాష లలో భారీ ఎత్తున విడుదల చేశారు.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో రాధే శ్యామ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ల ను కూడా రాబట్ట లేక పోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ద్వారా నిర్మాత లకు దాదాపు 120 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్లు ఒక వార్త అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ ,  ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సలార్ ,  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే ,  మారుతి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఒక మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ల షూటింగ్ లు కూడా ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి  ఈ మూడు మూవీ లపై ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: