తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటువంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సుధీర్ ఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ యువ హీరో ఆఖరుగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూ వీలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ తో ప్రేక్షకులను నిరాశపరిచిన సుధీర్ తాజాగా హంట్ అనే మూవీ లో హీరోగా నటించాడు. 

మూవీ గన్స్ డోంట్ లై అనే క్యాప్షన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ కి మహేష్ సురపనేని దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 26 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేయగా ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మూవీ ని యూఎస్ఏ లో జనవరి 25 వ తేదీన ప్రీమియర్స్ వేయనున్నారు. ఈ సినిమాను యూఎస్ఏ లో శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేయబోతుంది. ఈ విషయాన్ని శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: