టాలీవుడ్ సిని ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల ఆయన హీరోగా నటించిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మనందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రెండవ భాగం పుష్ప 2  అనే టైటిల్ తో ఈ సినిమా రెండో భాగం త్వరలోనే విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

ఈ నేపథ్యంలోనే పుష్పటు సినిమా కథ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు లీకై సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప టు సినిమాలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉంటుందని తెలుస్తోంది. ఎవరు ఊహించిన విధంగా ఈ ట్విస్ట్ ఉండబోతుందట. అంతేకాదు పుష్ప 1 లో అల్లు అర్జున్ పక్కనే ఉండే  కేశవ పాత్ర మనందరినీ ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఆ పాత్రలో జగదీష్ ప్రతాప్ నటించిన అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమా గురించి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పుష్ప 2  సినిమాలో కేశవ పాత్ర పుష్ప రాజ్ కి వ్యతిరేకంగా ఉంటుందని తెలుస్తోంది.

అంతేకాదు ఈ సినిమాలో సాహద్ ఫాజిల్ పాత్ర కంటే కేశవ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని కూడా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో కేశవ పుష్ప రాజ్ కు వెన్నుపోటు పొడుస్తాడని ఇక ఇది ఆ సినిమాకి పెద్ద ట్విస్ట్ అని తెలుస్తుంది. ఈ సినిమాలో ఈ ట్విస్ట్ హైలెట్గా నిల్వందట. అయితే డైరెక్టర్ సుకుమార్ దీనికి సంబంధించిన హింట్ ని ఇదివరకే అంటే పుష్ప పార్ట్ వన్ లోనే ఇచ్చారని తెలుస్తోంది. అందుకే పుష్ప టు సినిమా కథ మొత్తం కూడా కేశవ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుండి ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: