
సినీ రంగం లో ఆయన సాధించిన అరుదైన రికార్డ్స్, ఎదురైనా జయాపజయాలు అన్నీ కూడా మనకి తెలుసు.ఆయన వ్యక్తిగత జీవితం కూడా తెరిచిన పుస్తకమే.కానీ మనకి తెలియని కొన్న్ని ఆసక్తికరమైన విషయాలు, ఆయనలోని సృజనాత్మకత గురించి బాహ్య ప్రపంచాని కి తెలియని ఎన్నో కోణాలు ఉన్నాయి.వాటిల్లో ఒకటి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము.
ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగి గా పనిచేస్తున్న రోజు ల్లోనే బసవతారకం గారిని పెళ్లాడాడు.ఆయనకీ 8 మంది కుమారులు మరియు నలుగురు కుమార్తెలు పుట్టారు.వీరికి పేర్లు పెట్టడం లో ఎన్టీఆర్ తన మార్కు ని చూపించుకున్నాడు.ఆయన హిందూ ధర్మం అన్నా, హిందూ దేవేళ్ళు అన్నా ఎంతో ఆరాధ్యం.
అందుకే తన 8 కొడుకుల పేర్లకు చివర్లో 'కృష్ణ' వచ్చే లాగా పెట్టాడు.ఇక నలుగురు కూతుర్ల కు 'ఈశ్వరి' అనే వచ్చేలా పెట్టాడు.ఇక రెండవ తరం వంశం వాళ్లకి కూడా పేర్లు పెట్టడం లో తన మార్కు ను చూపించాడు ఎన్టీఆర్.రామకృష్ణ కుమార్తె పేరు కుదిమిని ,బాలకృష్ణ ఇద్దరు కూతుర్ల పేరులు తేజస్వి ని , బ్రహ్మీని పెట్టింది కూడా ఆయనే.అలా కొడుకుల దగ్గర నుండి మనవళ్ల వరకు ప్రతీ ఒక్కరి పేర్ల ను మన హిందూ దైవాలను గుర్తు చేసే విధంగా చేసాడు.