సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తూ ఉంటారు  కానీ వారిలో కొంత మందికి మాత్రమే దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ తోనే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలా దర్శకత్వం వహించిన ఫస్ట్ మూవీ తోనే మంచి గుర్తింపు దక్కించుకున్న వారిలో గౌతమ్ తిన్ననురి ఒకరు. ఈ దర్శకుడు సుమంత్ హీరో గా రూపొందిన మళ్లీ రావా మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. అలాగే ఈ మూవీ ద్వారా ఈ దర్శకుడి కి ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి కూడా మంచి ప్రశంసలు లభించాయి.

ఆ తర్వాత జెర్సీ మూవీ కి దర్శకత్వం వహించి మరో సారి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి ఈ దర్శకుడు మంచి ప్రశంసలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ దర్శకుడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ మూవీ విజయ్ దేవరకొండ కెరియర్ లో 12 వ మూవీ గా రూపొందబోతుంది. మరికొన్ని రోజుల్లోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇలా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే ఈ మూవీ కి సంబంధించిన ఒక అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.  

విజయ్ ... గౌతమ్ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఓకే అయినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ మూవీ ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ... సమంత హీరోయిన్ గా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: