అయితే అనారోగ్య పరిస్థితులు విసమించడంతో ఈరోజు సాయంత్రం 6 :15 నిమిషాల ప్రాంతం లో ఇమే తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. తమ తండ్రి కె విశ్వనాథ్ గారు కన్ను మూసిన వార్డులోనే తమ తల్లి కూడా జయలక్ష్మి మరణించడంతో చాలా దురదృష్టకరమని వారు ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఇక ఈమె పార్దివ దేహాన్ని కూడా కొద్దిసేపట్ లో ఫిలింనగర్ ప్రాంతం లో ఉన్న నివాసానికి తరలించబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.
రేపటి రోజున పంజాగుట్ట స్మశాన వాటిక లో ఆమె అంత్యక్రియలు జరపబోతున్నట్లు ప్రకటనలో తెలియజేయడం జరిగింది.శ్రీ కాశీనాధుని జయలక్ష్మి వయసు ప్రస్తుతం 88 సంవత్సరాలు ఈమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కే విశ్వనాథ్ గారితో వివాహం జరిగిందట. విశ్వనాథ్ గారి మరణించినప్పటి నుంచి ఆయన మీద ఉన్న ప్రేమతో ఈమె మంచానికే పరిమితమైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ సెలబ్రిటీల సైతం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒకే నెలలోనే విశ్వనాథ్ గారు తన భార్య మరణించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి