బుట్ట బొమ్మ పూజా హెగ్దే టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉంది అనుకుంటున్న టైం లో సడెన్ గా ఆమె చేతిలో సినిమాలేవి లేకుండా పోయాయి. పోటీగా రష్మిక.. కొత్త హీరోయిన్స్ శ్రీలీల, కృతి శెట్టి ఇలా వరుస ఛాన్స్ లు అందుకుంటుంటే పూజా కెరీర్ రిస్క్ లో పడేలా ఉంది. ప్రస్తుతం అమ్మడు మహేష్, త్రివిక్రం సినిమా మాత్రమే చేస్తుంది. అసలైతే అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాల దాకా ఉండాల్సింది కానీ పూజాని రిపీట్ చేసే ఉద్దేశం లేక పూజ ప్లేస్ లో శ్రీలీలని ఫిక్స్ చేస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ లో పూజా చేయాల్సిన హీరోయిన్ పాత్రని శ్రీలీలకి ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇలాంటి టైం లో తన చేతిలో ఉన్న మహేష్ సినిమాతో రచ్చ చేయాలని చూస్తుంది పూజా హెగ్దే. మహేష్ తో ఆల్రెడీ మహర్షి సినిమాలో నటించిన పూజా ఆ సినిమాలో అంతగా గ్లామర్ షో చేయలేదు. కానీ ఈసారి త్రివిక్రం సినిమాలో అమ్మడు రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యింది. అల వైకుంఠపురములో తన థై షోతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన పూజా హెగ్దే మహేష్ 28వ సినిమాలో కూడా గ్లామర్ షోతో అదరగొట్టాలని చూస్తుంది.

చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా ఈ సినిమాలో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తే తనకు సినిమా ఛాన్స్ లు వస్తాయని భావిస్తుంది పూజా హెగ్దే. త్రివిక్రం మీద హోప్స్ పెట్టుకున్న పూజా హెగ్దే తన కెరీర్ ఇప్పుడు ఆయన చేతుల్లో ఉందని భావిస్తుందట. ఓ పక్క కొత్త హీరోయిన్స్ కూడా ఎట్రాక్ట్ చేస్తున్న ఈ టైం లో పూజా హెగ్దే తన గ్లామర్ తో ఆడియన్స్ ని అలరించాలని చూస్తుంది. మరి మహేష్ సినిమాతో హిట్ కొట్టినా పూజాకి తర్వాత ఛాన్స్ లు వస్తాయా లేదా అన్నది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: