సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస విజయాలతో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. ఈ సినిమాకు చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ టైటిల్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

మూవీ మహేష్ కెరియర్ లో 28 వ చిత్రం గా రుపొందుతున్న కారణంగా ఈ మూవీ షూటింగ్ ను ఈ చిత్ర బృందం "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఫుల్ స్పీడ్ లో నిర్వహిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీ లో పూజా హెగ్డే ... శ్రీ లీల ... మహేష్ సరసన హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే మహేష్ ... దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నాడు. ఈ మూవీ మహేష్ కెరియర్ లో 29 మూవీ గా రూపొందబోతోంది. ఈ మూవీ ని శ్రీ దుర్గా ఆర్ట్స్ సంస్థ పై కేఎల్ నారాయణ నిర్మించబోతున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ స్టార్ట్ కాకముందే ఈ మూవీ పై గ్లోబల్ గా క్రేజ్ పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ గురించి తాజాగా సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా ఎం ఎం కీరవాణి ... మహేష్ ... రాజమౌళి మూవీ గురించి మాట్లాడుతూ ... మహేష్ తో తీయబోయే మూవీ ని రాజమౌళి భారీ యాక్షన్ తో కూడిన అడ్వెంచరస్ డ్రామా గా తెరకెక్కించనున్నట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూ లో భాగంగా ఎం ఎం కీరవాణి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: