కమెడియన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి బండ్ల గణేష్ ఈ మధ్య నే నిర్మాత గా కూడా మారారు. కొన్ని సూపర్ హిట్ సినిమాల ను కూడా తన ఖాతాలో వేసుకున్న బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక విషయంపై వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

అయితే చాలా వరకు బండ్ల గణేష్ తన కామెంట్ల వల్లే అందరి దృష్టి ని కూడా ఆకర్షిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యాఖ్యల తో కాంట్రవర్సీల లో అయితే నిలుస్తూ ఉంటారు.

తనని తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడి గా ప్రకటించుకున్నాడు బండ్ల గణేష్. ఈ మధ్యనే మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన "ధమాకా" సినిమా వేడుకలో కూడా కనిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రవితేజ పై బండ్ల గణేష్ ప్రశంసల వర్షాన్ని కురిపించారు. అయితే తాజాగా ఇప్పుడు మరొక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రవితేజ గురించి చెప్పుకొచ్చారటా బండ్ల గణేష్.

"నా ఫస్ట్ సినిమా రవితేజ తోనే నేను తీశాను. 13 ఏళ్ల క్రితం రవితేజ నటించిన ఆంజనేయులు సినిమా వల్ల నాకు ఐదు కోట్లు లాభం వచ్చింది.. మా ఇద్దరి మధ్య స్నేహం కూడా ఎప్పుడో మొదలైంది. గత 30 ఏళ్లుగా మా స్నేహం ఎలాంటి మనస్పర్థలు లేకుండా కొనసాగుతూనే ఉంది. అందుకే ధమాకా ఆడియో ఫంక్షన్ లో నేను అంతగా పొగిడాను," అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గురించి మాత్రమే ప్రశంసల వర్షం కురిపించే బండ్ల గణేష్. ఈమధ్య రవితేజ ను కూడా ఆకాశానికి ఎత్తేస్తూ వార్తల్లో నిలిచారు.. మరోవైపు రవితేజ వరుసగా రెండు బ్లాక్ బస్టర్ సినిమాలతో వచ్చి తన సినీ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు.రవితేజ తన తరువాత సినిమా రావణాసుర కూడా విడుదలకు సిద్దమైంది. ఇందులో రవితేజ నెగటివ్ షేడ్ వున్న క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: