యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి మూవీ ని వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ మూవీ గా రూపొందబోతుంది. కొంత కాలం క్రితమే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. అలాగే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరియు మోషన్ టీజర్ ను కూడా విడుదల చేసింది.

వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. కొంత కాలం క్రితమే ఈ మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ మూవీ బృందం ఈ సినిమా యొక్క లాంచింగ్ ను మార్చి 23 వ తేదీన అధికారికంగా చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లాంచింగ్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయాలా లేక నోవేటల్ లో చేయాల అనే విషయంపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లాంచింగ్ వేడుకకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ లాంచింగ్ వేడుకకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి సైఫ్ అలీ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: