అఖండ సినిమా వరకు కూడా వరుస ఫ్లాపుల తో సతమతమయ్యాడు నందమూరి వారసుడు బాలయ్య. అయితే ఇక బోయపాటి దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూడట్లేదు అని చెప్పాలి. ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు బాలయ్య. ఇక ఈ సినిమా ఎంత సూపర్ హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి కూడా భారీ రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది అని చెప్పాలి. తారకరత్న మరణం కారణంగా కొన్నాళ్లపాటు షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే కాజల్ పాత్ర ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇటీవల కాజల్ పాత్ర ఇలాగే ఉంటుంది అంటూ ఒక లీక్ బయటికి వచ్చింది. ఇది కాస్త అభిమానుల దృష్టిని తెగ ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఈ సినిమాలో కాజల్ బాలయ్య భార్యగా నటిస్తుందట. అయితే ఆమె ఎపిసోడ్ మొత్తం సెకెండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లోనే చూపిస్తారన్నది తెలుస్తుంది. అంతేకాదు ఇక కాజల్ పాత్ర విషాదకరంగా ముగుస్తుందట. కాజల్ పాత్ర ఎండింగ్ సీక్వెన్స్ ఇక ప్రేక్షకులందరికీ కన్నీళ్లు తెప్పించే విధంగా ఉంటుందని ఒక టాక్ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య కూతురుగా యంగ్ సెన్సేషన్ శ్రీ లీల నటిస్తూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: