తమిళ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి ధనుష్ తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకుల్లో ఒకరు అయినటు వంటి వెంకీ అట్లూరి దర్శకత్వం లో రూపొందిన సార్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో రూపొందింది. తెలుగు లో సార్ అనే పేరుతో విడుదల అయిన ఈ సినిమా తమిళ్ లో వాతి అనే పేరుతో విడుదల అయింది.

 ఈ క్రేజీ మూవీ ని సూర్య దేవర నాగ వంశీ నిర్మించగా ... ఈ మూవీ లో సంయుక్తా మీనన్ ... ధనుష్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో సముద్ర ఖని విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలక్షన్ లను వసులు చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా కొన్ని రోజుల క్రితం నుండే ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ యొక్క తెలుగు ... తమిళ భాషల మూవీ ప్రస్తుతం నేట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ రెండు భాషలకు సంబంధించిన సినిమా కూడా నెట్ ఫ్లీక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అదిరిపోయే రేంజ్ లో ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ తెచ్చుకుంటూ వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ లో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: