మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గ్లామరస్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు మరియు తమిళ భాషల్లో అనేక సినిమాలలో నటిస్తూ ఈ రెండు భాషల్లో కూడా మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. ప్రస్తుతం కీర్తి తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. 

మూవీ ని ఆగస్టు 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ దాసర సినిమాలో నాని కి జోడిగా నటించింది. ఈ మూవీ ని ఈ నెల 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడం తో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ దేశ వ్యాప్తంగా ఈ సినిమా ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. 

అందులో భాగంగా కీర్తి కూడా ఈ మూవీ ప్రమోషన్ లలో చాలా చురుగ్గా పాల్గొంటుంది. ఇది ఇలా ఉంటే కీర్తిమూవీ ప్రమోషన్ లకు వెళ్లిన చోట ఈ ముద్దుగుమ్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. అందులో భాగంగా తాజాగా ప్రమోషన్ లలో పాల్గొన్న కీర్తి వైట్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి వచ్చింది. ఇందులో కీర్తి తన అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం కీర్తి కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: