తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో ఇప్పటికే అనేక మూవీ లలో నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ హీరో వినరో భాగ్యము విష్ణు కథ అనే మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం ప్రారంభం లోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న కిరణ్ "మీటర్" అనే మరో మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ యూనిటీ సినిమా రన్ టైమ్ ను కూడా లాక్ చేసింది. ఈ మూవీ 127 నిమిషాల నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ కి రమేష్ కాడూరి దర్శకత్వం వహించగా ... సాయి కార్తీక్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ తో ఈ యువ హీరో ఏ రెంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: