తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో గుణశేఖర్ ఒకరు. ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన చూడాలని ఉంది సినిమాతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తన టాలెంట్ ఏంటో ఈ దర్శకుడు నిరూపించుకున్నాడు. ఆ తర్వాత పలు మూవీ లకు దర్శకత్వం వహించిన గుణశేఖర్ "ఒక్కడు" మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు.

ఇది ఇలా ఉంటే ఆఖరుగా గుణశేఖర్ ... అనుష్క ప్రధాన పాత్రల రూపొందిన రుద్రమదేవి సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత చాలా సంవత్సరాల వ్యాప్ తీసుకున్న గుణశేఖర్ తాజాగా శాకుంతలం అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో సమంత ... దేవ్ మోహన్ కీలక పాత్రలలో నటించారు. ఈ మూవీ ని ఏప్రిల్ 14 వ తేదీన తెలుగు , తమిళ  ,కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తాజాగా గుణశేఖర్ మీడియాతో పంచుకున్నాడు. తాజాగా గుణశేఖర్ "శాకుంతలం" మూవీ గురించి మాట్లాడుతూ ... శాకుంతలం పాత్రకి సమంత అయితే నే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అని తాను భావించానని చెప్పిన గుణశేఖర్ ఆ పాత్రలో ఆమె తన సహజ నటన తో పలు సన్నివేశాలలో అందరినీ ఆశ్చర్యపరిచారని అన్నారు. ఇలా తాజా ఇంటర్వ్యూలో భాగంగా సమంత పై గుణశేఖర్ ఇలా స్పందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: