
ఇక ప్రస్తుతం శ్రీదేవి భౌతికంగా మనతో లేకపోయినప్పటికీ అటు సినీ ప్రేక్షకుల మదిలో మాత్రం ఆమె స్థానం చిరస్థాయిగా నిలిచిపోయింది అని చెప్పాలి. అయితే శ్రీదేవి విషయంలో ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా శ్రీదేవి పెళ్లి అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అన్న విషయం తెలిసిందే. అయితే శ్రీదేవి తల్లి చేసుకోమని అడిగింది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. గతంలో హీరో రాజశేఖర్ కూ శ్రీదేవి కుటుంబానికి మంచి సంబంధాలు ఉండటంతో ఇక తమ కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న రాజశేఖర్ ను శ్రీదేవి తల్లి అడిగిందట.
రాజశేఖర్ మాత్రం తన తల్లి సినీ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పడంతో శ్రీదేవిని పెళ్లి చేసుకోలేదట. ఇక తర్వాత జెడి చక్రవర్తిని కూడా శ్రీదేవి తల్లి తన కూతురుని పెళ్లి చేసుకోమని అడిగిందట. కానీ జె.డి చక్రవర్తి కూడా పెళ్లి చేసుకోలేదు. అయితే చివరికి అటు లోక నాయకుడిగా పేరు సంపాదించుకున్న కమలహాసన్ ను సైతం శ్రీదేవి తల్లి ఇదే కోరిక కొరిందట. దీంతో కమలహాసన్ షాకింగ్ సమాధానం చెప్పాడట. నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటే మీరు మమ్మల్ని భరించలేరు. ఎందుకంటే ప్రతిరోజు శ్రీదేవి మీ ఇంటికి వస్తూ ఉంటుంది అంటూ సరదాగా శ్రీదేవి తల్లితో అన్నాడట. అయితే రెండో పెళ్లి వాడైనా బోనీ కపూర్ ను శ్రీదేవి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇలా అందరూ హీరోలను శ్రీదేవి తల్లి అడిగిందట. అయితే కమల్ చెప్పిన సమాధానం మాత్రం అటు శ్రీదేవి తల్లికి అర్థం కాలేదట.