ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ "అలా వైకుంటపురంలో" మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగాడు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అలా వైకుంఠపురంలో మూవీ వరకు స్టార్ హీరోగా కొనసాగిన అల్లు అర్జున్ 2021 సంవత్సరం విడుదల అయినటువంటి పుష్ప ది రైస్ అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించి ఈ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని తన క్రేజ్ ను పాన్ ఇండియా రేంజ్ లో పెంచుకున్నాడు.

 పుష్ప పార్ట్ 1 మూవీ లో అల్లు అర్జున్ తన అద్భుతమైన నటన తో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రశంశలను అందుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ సక్సెస్ సాధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రేమికులు పుష్ప పార్ట్ 2 మూవీ పై భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ పుష్ప పార్ట్ 2 మూవీ నుండి వేర్ ఇస్ పుష్ప అనే వీడియోను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసింది. ఈ వీడియోకు అన్ని భాషల ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ మూవీ లోని వేర్ ఇస్ పుష్ప వీడియోకు తెలుగు తో పాటు హిందీ భాషల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తుంది. అందులో భాగంగా ఈ మూవీ లోని వేర్ ఇస్ పుష్ప హిందీ వర్షన్ వీడియో 24 గంటల సమయంలో 27.67 మిలియన్ వ్యూస్ ను ... 1.29 మిలియన్ లైక్స్ ను దక్కించుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ వీడియోకు హిందీ ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: