సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మహేష్ ఇప్పటికే ఎన్నో భారీ బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోగా నటించి దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు . ఇది ఇలా ఉంటే ఆఖరు గా మహేష్ "సర్కారు వారి పాట" అనే మూవీ లో నటించి అద్భుతమైన విజయా న్ని అందుకున్నాడు . ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు . 

మూవీ మహేష్ కెరియర్ లో 28 వ మూవీ గా రూపొందుతుంది. దానితో ఈ సినిమాకు ఇప్పటి వరకు మూవీ యూనిట్ టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ మూవీ షూటింగ్ ను "ఎస్ ఎస్ ఎం బి 28" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తుంది. ఈ మూవీ తర్వాత మహేష్ ... రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ సినిమాల ద్వారా ఇతర బిజినెస్ ల ద్వారా ఎంత సంపాదించినప్పటికీ అందులో కొంత భాగాన్ని సమాజం కోసం ఖర్చు పెడుతూ ఉంటాడు.

 అందు లో భాగం గా ఇప్పటికే ఎంతో మంది చిన్నారు లకు గుండె ఆపరేషన్ లను చేయించి వారికి కొత్త జీవితా లను ఇచ్చాడు . తాజాగా కూడా మహేష్ ఒక చిన్నారికి శస్త్ర చికిత్సను చేయించి కొత్త జీవితాన్ని అందించాడు . తాజాగా మహేష్ తన ఫౌండేషన్ మీద శివాలి అనే రెండేళ్ల వయసు గల చిన్నారికి గుండె శస్త్ర చికిత్స నిర్వహించారు.  ఆ శస్త్ర చికిత్స విజయవంతం అవడంతో ఈ పాప ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లిపోయింది .

మరింత సమాచారం తెలుసుకోండి: