

క్రిస్మస్ కానుకగా ఈ సినిమాని నాని విడుదల చేయబోతున్నట్లు సమాచారం. నాని సరసన హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నది. ఈ చిత్రంలో మరొకసారి నాని తండ్రి పాత్రలో కనిపించబోతున్నారు. గతంలో కూడా జెర్సీ సినిమాలో నాని ఫాదర్ రోలు నటించి మెప్పించారు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కొత్త కథ అందించి తన నటనతో మెప్పించారు నాని.. దసరా వంటి మాస్ సినిమాలో నటించిన నాని ఇప్పుడు తాజాగా మరొక ప్రయోగానికి సిద్ధమయ్యారు అన్నట్లుగా తెలుస్తోంది.
నాని 31 సినిమాకు సంబంధించి షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతున్నది. సీతారామం సినిమాతో మంచి క్రేజ్ ను అందుకున్న మృణాల్ చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమా కథ ఎలా ఉండబోతోంది.. అనే విషయాలపై త్వరలోనే చిత్ర బృందం అప్డేట్ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్లో డిసెంబర్ సెంటిమెంట్ కొంతమంది సెలబ్రిటీలకు ఉంది. క్రిస్మస్ రేసులో వస్తే కచ్చితంగా ఆ సినిమా సక్సెస్ అవుతుందని భావన ఉన్నది ఇప్పటికే కొన్ని సినిమాలు క్రిస్మస్ కు విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. మరి నానితో పోటీపడే సినిమా ఏదో చూడాలి మరి.