
శంకర్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చి సెన్సేషన్ సృష్టించిన సినిమా ఒకే ఒక్కడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతలా గర్జించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాక్షన్ కింగ్ అర్జున్ కెరీర్ లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలిచిపోయింది. తమిళ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా సత్తా చాటింది. ఏకంగా 30 కోట్ల రూపాయలకు పైగానే షేర్ను రాబట్టింది అని చెప్పాలి. దీనిబట్టి అప్పట్లో ఈ సినిమా ఎంత సెన్సేషన్ విజయాన్ని సాధించిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని తమిళ్లో అర్జున్తో తెలుగులో మెగాస్టార్ తో తీయాలని అనుకున్నాడట డైరెక్టర్ శంకర్.
ఇక ఈ విషయంపై అటు మెగాస్టార్ చిరంజీవితో సంప్రదింపులు కూడా జరిపాడట.కానీ శంకర్ ఒకే ఒక్కడు సినిమా చిత్రీకరణ జరిపే సమయంలో అటు మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారట. దీంతో డేట్స్ ఖాళీ లేకపోవడంతో చిరంజీవి కథ నచ్చిన కూడా ఈ సినిమాను వదులుకున్నారట. చివరికి ఇక తమిళంలో తెరకెక్కించిన సినిమానే తెలుగులో డబ్ చేసిన శంకర్ అదే రేంజ్ లో హిట్ కొట్టాడు. ఇక ఈ విషయం తెలిసి ఒకవేళ చిరంజీవి గనుక ఈ సినిమా చేసి ఉంటే మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ చెరిగిపోని రికార్డులు క్రియేట్ అయ్యేవని ఫాన్స్ అనుకుంటూ ఉన్నారు.