ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీస్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సూపర్ హిట్ సాధించిన సినిమాలను ఇప్పుడు 4 కే క్వాలిటీతో మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక ఆయా హీరోల అభిమానులు అందరూ కూడా ఈ హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో చూసేందుకు బారులు తీరుతున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పటికే ఎంతోమంది టాలీవుడ్ స్టార్ హీరోలకు సంబంధించిన సినిమాలు అటు థియేటర్లో రిలీజ్ అయ్యాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ మూవీని కూడా రీ రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయన జయంతి సందర్భంగా కృష్ణ కెరియర్ లో సూపర్ హిట్ మూవీ అయిన మోసగాళ్లకు మోసగాడు సినిమాని రీ రిలీజ్ చేయబోతున్నారట. అయితే భారీ ఎత్తున ఈ రీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున స్క్రీనింగ్ చేయబోతున్నారట. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రతి థియేటర్లో కూడా రెండు షోలను ప్లాన్ చేశారట. డిమాండ్ ను బట్టి ఇక షోలను పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అప్పట్లో కృష్ణ హీరోగా ఏడు లక్షల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన మోసగాళ్లకు మోసగాడు సినిమా భారీ వసూళ్లు సాధించి నిర్మాతల పంట పండించింది అని చెప్పాలి. అయితే ఇలా ఏడు లక్షల బడ్జెట్ తో రూపొందిన సినిమాలు ఇప్పుడు 4k టెక్నాలజీలోకి మార్చడానికి మాత్రం 30 లక్షలు ఖర్చు అయిందట. అయితే మహేష్ అభిమానులకు మాత్రం ఒక్క టికెట్ కి రెండు షోలు చూడబోతున్నారు. మోసగాళ్లకు మోసగాడు సినిమాకు వెళ్ళినవారు సర్ప్రైజ్ అయ్యేవిధంగా మహేష్ బాబు సినిమా గ్లిమ్స్ ని థియేటర్లో స్క్రీనింగ్ చేయబోతున్నారట. ఇప్పుడు వరకు ఏ హీరో సినిమా గ్లిమ్స్ థియేటర్లో స్క్రీన్ చేయలేదు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: