తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో నితిన్ ఒకరు. ఈయన ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ స్టెట్స్ పై ఉండగానే నితిన్ ... వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

మూవీ లో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా కనిపించబోతోంది. ఈ మూవీ కి జీ వి ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీ సంస్థ నిర్మించబోతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే నితిన్ ... రష్మిక మందన ... వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ రూపొందింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించింది. ఇలా వీరి కాంబినేషన్ లో రూపొందిన భీష్మ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నితిన్ ... వెంకీ కుడుముల కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ షూటింగ్ జూన్ 5 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మొదటి షెడ్యూల్ లో ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరించే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నితిన్ రెండు వారాలు పాటు వెంకీ కుడుముల సినిమా షూటింగ్ లో ... రెండు వారాల పాటు వక్కంతం వంశీ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: