ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఆది పురుష్.. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించారు. మొదటిసారి ఒక బాలీవుడ్ డైరెక్టర్ పాన్ ఇండియా లెవెల్లో ఇలాంటి సినిమాని తెరకెక్కించారు అది కూడా తెలుగు హీరోతో.. దీంతో ఈ సినిమా పైన భారీగానే హైప్ ఏర్పడింది. ముఖ్యంగా రామాయణం కథ అంశంతో తెలకెక్కించడంతో ఈ సినిమాకు మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఇందులో సీత పాత్రలో కృతి సనన్ నటించగా సైఫ్ అలీ ఖాన్ రావణాసుడు పాత్రలో నటించారు. తదితర బాలీవుడ్ నటుల సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


 ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే దాదాపుగా రూ  550 కోట్లపైగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను రూ .250 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది.. అలాగే ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే రూ.185 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం. ఓవర్సీస్ కింది మరియు ఇతర భాషలో స్థానిక పంపిణీదారుల ద్వారా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. అన్ని అనుకున్నట్టుగానే సాగితే మొదటి వారంలోని నిర్మాతలకు ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.


ప్రభాస్ గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా బడ్జెట్ పరంగా కూడా భారీగానే ఉండడంతో ఈ సినిమా పైన ఖచ్చితమైన నమ్మకాన్ని తెలియజేస్తున్నారు చిత్ర బృందం. ఈ సినిమా ఈనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది మరి ఏ మేరకు ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. ప్రభాస్ మాత్రం వరుసగా పాన్ ఇండియా లెవెల్ లో పలు చిత్రాలను తెరకెక్కిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది సినిమాను కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: