టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ గా పేరు పొందిన శ్రీ లీల. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈమె స్పీడ్ కి స్టార్ హీరోయిన్లు సైతం కాస్త ఇబ్బంది పడుతున్నారని కూడా చెప్పవచ్చు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ కన్నడ ముద్దుగుమ్మ మొదట పెళ్లి సందD సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత రవితేజ నటించిన ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం మహేష్ పవన్ కళ్యాణ్ విజయ్ దేవరకొండ తదితర స్టార్ హీరోల సినిమాలలో కూడా నటిస్తోంది.


దాదాపుగా తన చేతిలో పదికి పైగా సినిమాలు ఉన్నట్లు సమాచారం.. తాజాగా ఈమె గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .అదేమిటంటే సినిమా విషయంలో శ్రీ లీల తన తల్లికి ఒక మాట ఇచ్చిందట ఇక మీదట సినిమాలలో ఎలాంటి రొమాంటిక్ లేదా ఇంటిమేట్ సీన్లలో నటించానని తన తల్లికి మాట ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన కెరియర్ ప్రారంభంలో కొన్ని సినిమాలలో రొమాంటిక్ సీన్లలో నటించిన అయితే వాటిని చూసిన  నేటిజెన్లు ఆమెను ట్రోల్ చేయడం జరిగిందట.


ఈ విషయం శ్రీ లీల తల్లి వరకు వెళ్లడంతో ఆమె చాలా బాధపడినట్లు తెలుస్తోంది. చిన్న వయసులోనే ఇలా ట్రోలింగ్స్ మొదలయితే రాబోయే రోజుల్లో ఇవి మరిన్ని పెరిగే అవకాశం ఉంటుందని తన తల్లి భావించడంతో ఇకమీదట అలాంటి సన్నివేశాలలో తనను నటించవద్దని శ్రీ లీల తల్లి కోరినట్లు సమాచారం. అందుకు ఆమె కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.. ఇకపై ఇలాంటి అభ్యంతరమైన సన్నివేశాలలో నటించమని తేల్చి చెప్పేస్తోందట శ్రీ లీల.. ఇందుకోసం తన దగ్గరకు వచ్చిన కొన్ని సినిమా ఆఫర్లను కూడా వదులుకున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఎన్ని సినిమాలలో నటిస్తుందో ఈ ముద్దుగుమ్మ చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: