
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం యు వి ప్రొడక్షన్స్ లో భాగం అయ్యాడు అన్న విషయం తెలిసిందే. ఇక నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సైతం నిర్మాణ సంస్థను స్థాపించి కొత్త దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ ప్రోత్సాహిస్తూ ఉన్నాడు. అయితే ఇక ఇప్పుడు మరో నందమూరి హీరో కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడట. త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్ ఇక కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు అన్నది తెలుస్తుంది. త్వరలోనే ఇక కొత్త బ్యానర్ ని ప్రకటించబోతున్నాడట.
ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు పనులు శరవేగంగా జరుగుతున్నాయి అన్నది తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ ప్రొడక్షన్ హౌస్ కి సంబంధించిన అన్ని వివరాలను కూడా ప్రకటించబోతున్నాడట ఎన్టీఆర్. ఇక నిర్మాణ సంస్థను ప్రారంభించిన తర్వాత మొదటి సినిమాను ఎవరితో చేయబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. కాగా తన ప్రొడక్షన్ హౌస్ లో మొదటి సినిమాను నాచురల్ స్టార్ నానితో చేయబోతున్నాడట ఎన్టీఆర్. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది అని చెప్పాలి. కాగా ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్.