బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.రబ్ నే బనాదీ జోడీ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారింది. బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అలా కెరియర్ లో మంచి ఊపులో ఉన్నప్పుడే టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకుంది ఈమె. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక పాపకి సైతం జన్మనిచ్చింది. దాంతో ఫ్యామిలీకి ఎక్కువ టైం కేటాయిస్తోంది ఈమె. చాలా తక్కువ గా సినిమాల్లో కనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే పెళ్లయిన తర్వాత నుండి ఇప్పటివరకు ఆమె కేవలం నాలుగు సినిమాల్లోనే నటించింది. 

ఇక ఆ సినిమాలో కూడా పెళ్లికి ముందు షూట్ చేసినవే. పెళ్లి తర్వాత ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అనుష్క తన సమయాన్ని మొత్తం పూర్తిగా తన ఫ్యామిలీ కేక్ కేటాయిస్తోంది. ఈ మధ్య ఆమె నటించిన సినిమా చెక్ దే ఎక్స్ప్రెస్ ఈ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది అనుష్క శర్మ. ఇక ఈ సినిమా టీమిండియా ఉమెన్ క్రికెటర్ జులన్ గోస్వామి బయోపిక్ గా రాబోతుంది. అనుష్క శర్మ నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్ లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే అనుష్క శర్మ నుండి ఎక్కువ సినిమాలు రాకపోవడంతో ఆమె అభిమానులు నిరాశపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అనుష్క శర్మ ఒక ప్రకటన చేసి ఫ్యాన్స్ కి ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

ఈ క్రమంలోనే ఇటీవల బాలీవుడ్ లో ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన అనుష్క శర్మ నా కూతురు వమిక కు ఇది చాలా కీలకమైన సమయం.. నేను తనని దగ్గరుండి చూసుకోవాలి.. విరాట్ కూడా బాగానే చూసుకుంటాడు కానీ తల్లిగా నా బాధ్యతను నేను చేయాలి..అందుకే నా కూతురు విరాట్ నా కుటుంబం కోసం నా పూర్తి సమయాన్ని వాళ్ళకి ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అంటూ తెలియజేసింది. అంతేకాదు ఇకపై ఏడాదికి ఒకటే సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.. నా నిర్ణయం నా అభిమానులకు బాధ కలిగిస్తుందని తెలుసు.. కానీ ప్రస్తుతం నేను నా సమయాన్ని నా కుటుంబానికి ఇవ్వాలి.. నటిగా భార్య గా తల్లిగా ఒక సెలబ్రిటీగా ప్రతి పాత్రను నేను ఆస్వాదించాలి ప్రస్తుతం తల్లి పాత్రను తృప్తిగా ఆస్వాదించాలని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది అనుష్క శర్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: