సౌత్ సినీ ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది ఈమె.అయినప్పటికీ పెద్దగా రొమాంటిక్ సీన్లలో నటించలేదు. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అవుతున్నప్పటికీ ఇప్పటివరకు లిప్ లాక్ వంటి సన్నివేశంలో నటించలేదు తమన్న. కానీ 18 ఏళ్లుగా వరుసగా సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఆమెతోపాటుగా సినీ ఇండస్ట్రీకి వచ్చినా చాలామంది హీరోయిన్ల కి పెళ్లి అయిపోయినప్పటికీ ఆమె మాత్రం పెళ్లి చేసుకోలేదు. 

ఆ హీరోయిన్లకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నప్పటికీ తమన్న కి మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. కానీ గత రెండేళ్లుగా చూసుకుంటే ఆమెకు హీరోల సినిమాల్లో అస్సలు అవకాశాలు రావట్లేదు. దాంతో తమన్న ఇప్పుడు చిన్న సినిమాల్లో నటిస్తోంది. అంతేకాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అలరిస్తోంది ఈమె. వెబ్ సిరీస్ లలో సెన్సార్ రూల్స్ ఉండవు కాబట్టి ఎంత పచ్చిగా నటించినా చెప్పేవారు ఎవరూ ఉండరు. అయితే తాజాగా తమన్నా కూడా అదే రూట్ లో వెళ్తుందని అంటున్నారు. తాజాగా తమన్నా సైతం గ్లామర్ కు హద్దులు చెరిపేస్తుంది. అంతేకాదు ఎంత పచ్చి రొమాన్స్ చేయడానికి అయిన రెడీ అయ్యింది తమన్న.

అయితే తాజాగా తమన్నా నటించిన జి కర్త అనే వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక ఈ ట్రైలర్ చూస్తూ తమన్నా ఎంతగా తన రూటు మార్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వెబ్ సిరీస్ లో తమన్నా బెడ్రూం సీన్లలో ఒక రేంజ్ లో రెచ్చిపోయింది అని చెప్పాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణమైన రొమాన్స్ సన్నివేశాల్లో నటించింది ఈమె. ఇక ఈ ట్రైలర్ చూసిన తమన్నా ఫ్యాన్స్ చూసి షాక్ అవుతున్నారు. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్ చేస్తుందని మేము అస్సలు ఊహించలేదు అంటూ కామెంట్స్ సైతం పెడుతున్నారు. అంతేకాదు ఇప్పుడే ఇలా నటిస్తోంది అంటే రాబోయే రోజుల్లో లవ్ స్టోరీస్ సినిమాల్లో ఇంకా దారుణంగా రెచ్చిపోయే అవకాశాల సైతం కనిపిస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: