రెబల్ స్టార్ ప్రభాస్ ఆఖరుగా నటించిన 5 మూవీలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందో తెలుసుకుందాం.

ఆది పురుష్ : ప్రభాస్ తాజాగా నటించిన ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ జూన్ 16 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

రాదే శ్యామ్ : ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో 105.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

సాహో : ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 121.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి సుజిత్ అనే యువ దర్శకుడు దర్శకత్వం వహించగా ... శ్రద్ధ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ మూవీ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదిరిపోయే రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 122 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా నటించగా ... ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.

బాహుబలి 1 : ప్రభాస్ హీరోగా అనుష్క ... తమన్నా హీరోయిన్ లుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 66 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: