
ఈ రోజున విజయ్ దళపతి పుట్టినరోజు కావడం తో లియోనించి ఫస్ట్ లుక్ ని నిన్నటి రోజు అర్ధరాత్రి 12 గంటలకు విడుదల చేయడం జరిగింది. దీంతో ఈ ఫస్ట్ లుక్ తెగ వైరల్ గా మారుతోంది.ఇక విజయ్ పుట్టినరోజు నేడు ఈ అప్డేట్ తెలియజేయడంతో అభిమానులు తెగ సంతోషాన్ని తెలియ జేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో విజయ్ సుత్తి పట్టుకొని విలన్సుతో ఫైట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.అలాగే విజయ్ పక్కన ఒక తోడేలు ఉంటూ చాలా పవర్ ఫుల్ లుక్కులు కనిపిస్తున్నట్టుగా చూపించడం జరిగింది లోకేష్ కనకరాజు.
ఇంత మాస్ గా ఫస్ట్ లుక్ ఉండడంతో లియో సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. విజయ్ కి సంబంధించి ఈ లియో పోస్టర్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి.ఇక లోకేష్ కనకరాజు కూడా కేవలం తాను పది సినిమాలను మాత్రమే తెరకెక్కించి ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తానని విషయాన్ని గత కొద్దిరోజుల క్రితం తెలియజేయడం జరిగింది. ఖైదీ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న లోకేష్ కనకరాజు ఆ తర్వాత ఎన్నో చిత్రాలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నారు. మరి విజయ్ దళపతి పుట్టినరోజు సందర్భంగా మరి ఈరోజు మరిన్ని అప్డేట్లు వస్తాయేమో చూడాలి మరి.