టాలీవుడ్ క్రేజీ హీరోలలో ఒకరు అయినటువంటి శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. అలా తన కెరియర్ లో ఎన్నో చిన్న చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ నటుడు ప్రస్తుతం సినిమాల్లో కేవలం హీరో పాత్రలో మాత్రమే నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటుడు హీరో గా నటించిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను సాధించడం మాత్రమే కాకుండా భారీ కలక్షన్ లను కూడా వసూలు చేశాయి. అందులో భాగంగా ఈ నటుడి కెరియర్ లో హైయెస్ట్ షేర్ కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 3 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సామజవరగమన : శ్రీ విష్ణు హీరో గా రూపొందిన ఈ సినిమా తాజాగా థియేటర్ లలో విడుదల అయింది. రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ సాలిడ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రపంచ వ్యాప్తంగా లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7.77 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.

బ్రోచేవారెవరురా : శ్రీ విష్ణు హీరో గా రూపొందిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకొని ప్రపంచ వ్యాప్తంగా 6.36 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రాజ రాజ చోరా : శ్రీ విష్ణు హీరో గా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి 6.22 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది.


మరింత సమాచారం తెలుసుకోండి: