పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో అత్యంత వేగంగా తెరకెక్కిన సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రో సినిమా అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరో తొమ్మిది రోజుల్లో ఈ సినిమా విడుదలై ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా అంచనాలకు మించి మెప్పించడం ఖాయమని అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు. అయితే ఈ సినిమాలోసాయి ధరమ్ తేజ్ కి జోడిగా  కేతిక శర్మ  నటించడం జరిగింది. ఇక కేతిక తెలుగులో నటించిన సినిమాలేవి ఆశించిన స్థాయిలో ఆమెకి గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. ఇకపోతే కేతిక శర్మ బ్రో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడంతో..

ఆమె మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కోసమే బ్రో సినిమా ఒప్పుకున్నారని పవన్ కళ్యాణ్ పేరు వింటే చాలని సినిమా ఒప్పుకోవడానికి అంతకుమించి కారణాలేవీ అంటూ ఈ సందర్భంగా పేర్కొంది కేతిక. అయితే బ్రో సినిమాలో పవన్తో కాంబినేషన్ సీన్లు లేవని ఈ సందర్భంగా ఆమె పేర్కొంది. ఇకపోతే పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో నటించినందుకు తనకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుందని వెల్లడించింది.  కాగా పవన్ కళ్యాణ్ను గతంలో ఎప్పుడూ కలవలేదని మొదటిసారి ఈ సినిమా ద్వారా కలిసే అవకాశాన్ని అందుకున్నానని చెప్పుకొచ్చింది.

ఇకపోతే పవన్ ను కలవడం తన అదృష్టం అని చెప్పుకొచ్చింది కేతిక. అనంతరం సాయి ధరమ్ తేజ్  ను రిక్వెస్ట్ చేసి పవన్ ను కలిసి 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పింది. ఇక బ్రో సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లోని అత్యంత భారీ స్థాయిలో బిజినెస్ జరగబోతుంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ రాబోతున్నాయి. కాగా పవన్ కళ్యాణ్సినిమా కోసం 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: