మోస్ట్ టాలెంటెడ్ మోస్ట్ గ్లామరస్ నటిమని మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి హ్యాపీ డేస్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కాయి. అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల నుండి కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. అలా ఈ ముద్దుగుమ్మకు వరస క్రేజీ మూవీ అవకాశాలు దక్కడం ... అలాగే ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలలో ఎక్కువ శాతం మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాలను అందుకోవడంతో అతి తక్కువ కాలంలోనే ఈ  బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ స్థానానికి ఎదిగిపోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ కూడా ఈ నటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. 

అందులో భాగంగా తాజాగా ఈ నటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన భోళా శంకర్ అనే సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులను తమన్నా పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ తో తమన్నా కు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ  రేంజ్ విజయం దక్కుతుందో చూడాలి. ఇకపోతే ఈ మూవీ లో కీర్తి సురేష్ ... సుశాంత్ కీలకమైన పాత్రలలో కనిపించనుండగా ... మహతీ స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: