తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు కలిసి "బ్రో" అనే సినిమాలో హీరోలుగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. సముద్ర కని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ వారు ... జీ స్టూడియోస్ బ్యానర్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించగా ... ఈ మూవీ లో సాయి తేజ సరసన కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. ప్రియా ప్రకాష్ వారియర్మూవీ లో కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ తమిళ సినిమా అయినటు వంటి వినోదయ సీతం అనే మూవీ కి అధికారికంగా రీమేక్ గా రూపొందింది. ఈ సినిమా వినోదయ సీతం అనే సినిమాకు రీమేక్ అయినప్పటికీ ఈ మూవీ కథ ... కథనంలో అనేక మార్పులను ... చేర్పులను చేసినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే బ్రో సినిమాను జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ సినిమాకు క్లీన్ "యు" సర్టిఫికెట్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకకు సంబంధించిన తేదీని ... వేదికను ఖరారు చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదికలో ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: