సినిమా థియేటర్లలో సినిమా స్టార్ట్ అయ్యే ముందు మనకు యాడ్ వస్తుంది. ఈ నగరానికి ఏమైంది ఒకవైపు పొగ మరొకవైపు నుసి అనే యాడ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ యాడ్ వల్ల దమ్ము కొట్టే వాళ్ళు మానుకున్నారో లేదో తెలియని గాని ఇందులో నటించిన ఒక చిన్న పాప మాత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. తండ్రి సిగరెట్ చేతిలో పట్టుకుంటే అమాయకంగా చూస్తుంటే చాలా జాలి వేస్తుంది. అయితే ఈ పాప ఇప్పుడు తెలుగులో ఒక సినిమాలో నటించేందుకు రెడీ అయింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా

 వైరల్ అవుతున్నాయి. అయితే ఈ యాడ్లో నటించిన పాప పేరు సిమ్రాన్ నటేకర్ సిగరెట్ యాడ్లో నటించిన ఈమె దాని తర్వాత చాలా యాడ్లలో నటించింది. దాని తర్వాత బాగా ఫేమస్ అయిన చిన్నారి పెళ్ళికూతురు సీరియల్లో పూజ పాత్రలో నటించింది. దాని తర్వాత ధూమ్. 3  సినిమాలోని చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది అనంతరం 2010లో జానే కహన్ సే ఆయి హై అనే సినిమాలో నటించింది. అయితే ఈ అమ్మాయికి మాత్రం స్టార్ గుర్తింపు రాలేదు. దీంతో ఆమెకి తెలుగు సినిమాలపై ఆసక్తి పెరిగింది పలు ఆడిషన్స్ లో కూడా పాల్గొంటుంది. కొందరి డైరెక్టర్లను 

ఇప్పటికే కలిసి తన గురించి చెప్పింది ఈమె. అయితే ఒక డైరెక్టర్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయనకి ఓకే అయితే తెలుగు సినిమాల్లో ఈ చిన్నారిని మనం ఎప్పుడూ హీరోయిన్గా చూడవచ్చు. ముంబైకి చెందిన ఈమె 1997లో జన్మించింది. చిన్న వయసులోనే యాడ్స్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు ఈమె హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడంతో ఈ యాడ్ చూసిన వారందరూ షాక్ అవుతున్నారు. అప్పుడే ఈ పాప ఎంత పెద్దగా అయిపోయిందో అంటూ ఈమె గురించి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. తన సోషల్ మీడియా వేదికగా తనకి సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: