తెలుగు చిన్న సినిమాల చరిత్రలో ఎవరు ఊహించని ఘన విజయం  సాధించిన ‘బేబి’ మూవీ త్వరలో  100 కోట్ల కలక్షన్స్ మార్కును అందుకునే విధంగా పరుగులు తీస్తోంది. పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ కూడ ఈమూవీ కలక్షన్స్ ను పెద్దగా ప్రభావితం చేయలేకపోయింది అంటే ‘బేబి’ మ్యానియా ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది.ఇండస్ట్రిలో ఏమాత్రం పేరు అనుభవంలేని దర్శకుడు సాయి రాజేష్ ఏమాత్రం క్రేజ్ లేని నటీనటులతో తీసిన ఈమూవీ సాధించిన ఘన విజయం చూసి ఇండస్ట్రి వర్గాలు షాక్ అవుతున్నాయి. సంచలనాలు  సృష్టించిన ఈ సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉండటం చాలామందికి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి ‘రంగస్థలం’ ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలు మూడు గంటల నిడివితో వచ్చిన  నేపధ్యంలో ఆసినిమాల స్పూర్తితో ‘బేబీ’ మూవీ నిడివి విషయంలో  ఈసినిమా దర్శక  నిర్మాతలు ఈసాహసం చేసినట్లు తెలుస్తోంది.  

 

వాస్తవానికి ఈసినిమా షూట్ పూర్తి అయ్యేసరికి ఈ సినిమా పుటేజ్ ఏకంగా 5 గంటల 25 నిమిషాలకు తేలిందట. ఈవిషయాన్ని దర్శకుడు సాయి రాజేష్ ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియచేశాడు. అలాంటి పరిస్థితులలో ఈసినిమాను ఎలా కట్ చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉండగా ఈ ప్రాజెక్టులోకి ఎడిటర్ నైషద్ వచ్చి ఈసినిమాకు  సంబంధించిన లాంగ్ షాట్లు అన్ని కట్ చేయగా ఫస్టాఫ్ గంటా 50 నిమిషాలకు పైగా సెకండాఫ్ 2 గంటలకు పైగా వచ్చిందని సాయి రాజేష్ చెప్పాడు.దీనితో తనలో మరింత కన్ఫ్యూజన మొదలైపోయిందని చెపుతూ ఆపరిస్థితులాలో దర్శకుడు మారుతి చేసిన సహాయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. తన దృష్టిలో ఈసినిమాకు సంబంధించిన ప్రతి సీన్ బాగా ఉంది అన్న తన కన్ఫ్యూజన్ ను మారుతికి చెప్పగానే అతడు ఓర్పుగా తనను పక్కన కూర్చో పెట్టుకుని ప్రతి సీన్ ను వీలైనంత కట్ చేస్తూ వెళ్లడంతో ఈమూవీ ఎట్టకేలకు 3 గంటల రన్ టైమ్ సెటిల్ అయిన విషయాన్ని బయాటపెట్టాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: