2004 వ సంవత్సరం విడుదల అయిన 7/జి బృందావన కాలనీ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏ ఎం రత్నం నిర్మించాడు. ఈ మూవీ లో రవికృష్ణ ... సోనియా అగర్వాల్ హీరో ... హీరోయిన్ లుగా నటించారు. ఇకపోతే ఈ సినిమా మొదటగా తమిళ్ లో 2004 అక్టోబర్ 15 వ తేదీన విడుదల అయ్యింది. ఆ తర్వాత ఈ సినిమా 2004 నవంబర్ 6 వ తేదీన తెలుగు లో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా  విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా భారీ కలెక్షన్ లను కూడా సాధించింది. ఇకపోతే ఈ సినిమాలో రవికృష్ణ ... సోనియా అగర్వాల్ పా నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. 

ఇకపోతే ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఈ మూవీ సంగీతం శ్రోతలను ఎంత గానో ఆకట్టుకుంది. ఈ మూవీ విజయం లో యువన్ అందించిన సంగీతం కూడా ముఖ్య పాత్రను పోషించింది . అలా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వెలు వడింది. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లో 4 కే అల్ట్రా HD వర్షన్ తో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రస్తుతం ఈ మూవీ 4 కే అల్ట్రా HD పనులు ప్రారంభం అయినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: