టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నాగార్జున తన కెరీర్ లో ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించాడు . అలాగే ఎన్నో లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లలో కూడా హీరో గా నటించాడు. అందులో భాగంగా నాగార్జున హీరో గా రూపొందిన లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లలో మన్మధుడు మూవీ ఒకటి . ఈ సినిమా 2002 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది . ఈ సినిమాకు కే విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా ... త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు కథను మరియు మాటలను అందించాడు. సోనాలి బింద్రే ... అన్షు ఈ సినిమాలో నాగార్జున సరసన హీరోయిన్ లుగా నటించ గా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున స్వయంగా నిర్మించాడు. 

ఇకపోతే ఈ సినిమా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే మన్మధుడు మూవీ ని ఈ నెల 29 వ తేదీన భారీ ఎత్తున రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక పోతే ఈ మూవీ రీ రిలీజ్ కోసం అక్కినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా చాలా రోజులుగా వేచి చూస్తున్నారు . ఇకపోతే రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: