ఈ సినిమాలో విలన్ పాత్ర పోషించబోతున్నాడు సైఫ్ అలీ ఖాన్ అంటూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేస్తూ బైరవ అంటూ ఇంట్రడ్యూస్ చేశారు . ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో దేవర సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది. ఈ సినిమా లో జాన్వీ కపూర్ పేరు 'దేవిక' అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ బావ మరదలుగా కనిపించబోతున్నారట .
అంతేకాకుండా విలన్ తో వచ్చే ఫైట్ లో జాన్వీ కపూర్ చనిపోతుంది. ఆ తర్వాతే జాన్వి తన మరదలి కోసం వైల్డ్ గా మారి దేవర తాను అనుకున్న పనిని పూర్తి చేస్తాడు అంటూ స్టోరీ లైన్ కూడా లీక్ అయిపోయింది . అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ షెడ్ లో కనిపించబోతున్నారట . అంతేకాదు ఒకప్పటి ఆయన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఆది' సినిమాలో ఎలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ వాడారో.. సేమ్ దేవరకు కూడా అలాగే మాస్ మాసివ్ స్ట్రాంగ్ కౌంటర్ డైలాగ్స్ ఉండబోతున్నాయి అంటూ తెలుస్తుంది . దీంతో కొరటాల శివ ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత బిగ్గెస్ట్ హిట్ కొట్టేస్తున్నాడు అంటూ జనాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి