పూరి జగన్నాథ్ దర్శకుడుగా తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని ముద్రను వేసుకున్నాడు. చాలామంది హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి వారిని నిలదొక్కుకునేలా చేశాడు ప్రస్తుతం పూరీకి డౌన్ ఫాల్ నడుస్తోంది.ఆయన తీస్తున్న సినిమాలు విజయవంతం కావడం లేదు. అందుకే స్టార్ హీరోలు ఎవరూ కూడా అతనికి డేట్స్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ తీస్తేనే నటిస్తాము అని చెప్పిన హీరోలు సైతం నేడు ముఖం చాటేస్తున్నారు. అందుకే ఆస్తులు అమ్ముకొని మరి ఈ సినిమా నిర్మాణం చేపడుతున్నాడు ఒకానొక సమయంలో రోడ్డుపైకి కూడా వచ్చాడు మళ్ళీ సినిమా లు విజయవంతం కావడంతో ఆస్తులను సంపాదించుకోగలిగాడు.అందుకే అతడికి డబ్బు అంటే వ్యామోహం లేదు అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో మనం చెప్పలేము అంటాడు.

ఇక పూరి జగన్నాథ్ కథలు రాయాలంటే బ్యాంకాక్ వెళ్లాల్సిందే అనే విషయం మనందరికీ తెలుసు. అతడికి బ్యాంకాక్లోని పటాయా బీచ్ లోకి వస్తూ కూర్చుని కథలు రాయడం అంటే ఎంతో ఇష్టం. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూస్ లో పూరి చెప్పాడు తనకు ఎందుకో తెలియదు కానీ బీచ్ లు అంటే ఇష్టం అని, అందులో పటాయా బీచ్అంటే మరీ ఇష్టం అని అక్కడే నా సినిమా కథలను రాస్తానని కూడా తెలిపాడు. పటాయా బీచ్ లో ఒక ముసలావిడ ఉంటుందని తనకు కావాల్సినవన్నీ కూడా ఆమె సమకూరుస్తుందని కాఫీ, టీ దగ్గర నుంచి భోజనం వరకు అన్ని ఆమె జాగ్రత్తగా చూసుకుంటుంది అని తెలిపారు.

ఇక తన రిటైర్మెంట్ గురించి కూడా పూరి జగన్నాథ్ ప్రస్తావించాడు ఇక సినిమాలో తీసే ఓపిక లేదు అనుకున్నా రోజు పట్టాయా బీచ్కు దగ్గరలోని ఒక ఇల్లు కొనుక్కొని ఆ బీచ్ లోనే తన సమయాన్ని అంత గడుపుతానని తన భార్య కూడా అలాగే పటాయలోనే ఉండాలని అనుకుంటుందని తెలిపారు. అదృష్టం ఉంటే బీచ్ దగ్గరే తన రిటైర్మెంట్ లైఫ్ అంతా గడిపేస్తానని కూడా తెలుపుతున్నాడు పూరి జగన్నాథ్. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ సినిమా తీసే పనిలో ఉన్నారు పూరి కొడుకు ఆకాష్ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: