ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన జోష్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగిస్తున్న శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు ఆఖరుగా మా వీరన్ అనే తమిళ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయాన్ని తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇదే సినిమాను తమిళ్ తో పాటు ఒకే సారిగా తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగు లో ఈ సినిమాని "మహా వీరుడు" పేరుతో విడుదల చేశారు.

మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే "ఓ టి టి' ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వగా ఈ మూవీ కి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడి తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ నటుడు తన తదుపరి మూవీ ని తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి మురుగదాస్ దర్శకత్వంలో చేయబోతున్నట్లు  ఈ క్రేజీ మూవీ కి సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించబోతున్నట్లు అలాగే ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు కోలీవుడ్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం మృణాల్ తెలుగు లో నాని సరసన ఒక మూవీ లోను ... విజయ్ దేవరకొండ సరసన ఒక మూవీ లోను హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Sk