తమిళంలో వరుస సినిమాలు చేసింది నిధి అగర్వాల్.. కాని శింబుతో ప్రేమ అంటూ వచ్చిన రూమర్లు .. ఆమెకెరీర్ పై ప్రభావం చూపించాయి. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ జోడీగా.. హరీహరవీరమల్లు సినిమాలో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది బ్యూటీ. ఈసినిమాతో టాలీవుడ్ లో మరోసారి వెలుగు వెలగ వచ్చు అనుంది. కాని ఈమూవీ షూటింగ్ ముందుకు కదలకపోవడంతో.. మళ్లీ వెనకడుకువేసింది.టాలీవుడ్ నుంచి అందుతున్న తాజా సమాచారం.. ప్రకారం తెలుగులో ఈ భామ మరో బంపరాఫర్‌ను చేజిక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ హారర్ కామెడీ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ ను తీసుకున్నట్టు సమాచారం. ఇస్మార్ట్ శంకర్ తరువాత అంతకంటే భారీ సినిమా ఆఫర్ నిధికి రావడం ఇదే.
ఇందులో నిధి అగర్వాల్‌ను హీరోయిన్ గా దాదాపు ఖరారు చేశారని తెలిసింది. ఈసినిమాకు రాజా డీలక్స్ తో పాటు మరికొన్ని పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ ఆఫర్ నిజంగా నిధి అగర్వాల్ కు వస్తే.. ఆమె పంట పండినట్టే అనుకోవాలి. సినిమా హిట్ అయితే.. టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నిధి వెలిగిపోయే అవకాశం ఉంది.ఈ బెంగళూరు సోయగానికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో కూడా భారీగా ఫాలోయింగ్ ఉంది నిధి. ఆమె వేసే సోకుల ఎరకు పడినివారు ఉండు. తెలుగులో సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇక ప్రభాస్ సరసన మెరవబోతుంది బ్యూటీ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి