టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ ఆఖరుగా లైగర్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళ , కన్నడ , హిందీ , మలయాళ  భాషలలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొని భారీ నష్టాలను చవి చూసింది. ఇకపోతే లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత ఈ యువ నటుడు ఖుషి అనే లవ్ రొమాంటిక్ ఎంటర్టైర్ మూవీ.తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ.లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమని సమంత హీరోయిన్ గా నటించగా ... శివ నర్వాన ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 1 వ తేదీన భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం ,  హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి అనేక పాటలను మరియు అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ యొక్క అడ్వాన్స్ బుకింగ్స్ ను ఆగస్టు 25 వ తేదీ నుండి ఓపెన్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇకపోతే ఈ మూవీ కి కనుక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే భారీ మొత్తంలో కలెక్షన్ లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ లో కలెక్షన్ లను వస్తువులు చేస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం విజయ్ ... పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: