తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , సిద్దు జొన్నలగడ్డ , వైష్ణవ్ తేజ్ , వెంకటేష్ , నాని హీరోలుగా రూపొందుతున్న సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. వారు ఏ సినిమాలలో నటిస్తున్నారు ..? ఆ సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చిలుకూరు పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మరియు కొంతమంది పై భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు కోటి పరిసర ప్రాంతాల్లో మహేష్ బాబు పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

సిద్దు జొన్నలగడ్డ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తున్న అనుపమ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వైష్ణవ తేజ్ ప్రస్తుతం ఆది కేశవ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వైష్ణవ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

వెంకటేష్ ప్రస్తుతం సైంధవ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు శ్రీలంక లో వెంకటేష్ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నటిపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

నాని ప్రస్తుతం హాయ్ నాన్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం నాని మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ పై ఊటీలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: