నాగ చైతన్య , చందు మొండేటి కాంబినేషన్ లో మొదటగా సవ్యసాచి అనే మూవీ రూపొందింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోలేక పోయింది. ఆ తర్వాత వీరి కాంబోలో మలయాళం లో అద్భుతమైన విజయం సాధించినటువంటి ప్రేమమ్ సినిమా రూపొందింది. ఈ మూవీ పరవాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబోలో మూడవ సినిమా రూపొందబోతుంది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కనుంది నాగ చైతన్య కెరియర్ లో ఇదే మొట్ట మొదటి పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కోసం చైతన్య , చందు ఇద్దరు కూడా సముద్ర తీర ప్రాంతాలను సందర్శించారు. దానికి ప్రధాన కారణం ఈ మూవీ కూడా సముద్ర తీర ప్రాంతంకి సంబంధించిన కథతో రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఈ మూవీ లో నాగ చైతన్య కి జోడిగా సాయి పల్లవి నటించబోతుంది అంటూ ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లో నాగ చైతన్య సరసన సాయి పల్లవి ఆల్మోస్ట్ కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది.

మరో రెండు మూడు రోజుల్లో ఈ విషయాన్ని ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇకపోతే గతంలో చైతన్య , చందు కాంబోలో రూపొందిన ప్రేమమ్ సినిమాలోనే ఈ ముద్దుగుమ్మను తీసుకోవాలి అని వీరు అనుకున్నారట. కానీ అప్పుడు అనుకోను కారణాల వల్ల ఆమె సెలెక్ట్ కాలేదు. ఇంత కాలానికి వీర కాంబోలో రూపొందబోయే మూవీ లవ్ సాయి పల్లవి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: