
నాగార్జునకు చిన్ననాటి స్నేహితుడైన జగపతి బాబు ఇప్పటికీ అతడితో సన్నిహితంగా ఉంటూనే ఉంటాడు. రాజమౌళి కుటుంబ సభ్యులు అందరితోనూ చాల సన్నిహితంగా ఉండే జగపతి బాబుకు ప్రభాస్ మధ్య చాల మంచి సాన్నిహిత్యం ఉంది అన్న విషయం చాల కొద్దిమండికి మాత్రమే తెలిసిన విషయం. ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ గతంలో ప్రభాస్ తన డిప్రెషన్ తీరడానికి ఎలా సహకరియించాడు అన్న విషయాన్ని తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ‘‘ప్రభాస్ అందరితోనూ ప్రేమగా ఉండే మనిషి. అతడికి ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు. ఎవరికి ఏ సాయం కావాలన్నా చేస్తాడు. నాకు వ్యక్తిగతంగా ప్రభాస్‌తో ఒక అనుభవం ఉంది. నేను ఓసారి డిప్రెషన్లోకి వెళ్లాను. అప్పుడు ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని అడిగా. అప్పటికతను ఓ సినిమా షూటింగ్ కోసం జార్జియాలో ఉన్నాడు. ‘డార్లింగ్ నేను ఉన్నా కదా.. నీ సమస్య చెప్పు. నేను తీరుస్తా’ అంటూ అప్పట్లో ప్రభాస్ తనకు ధైర్యం చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.
ఆతరువాత ప్రభాస్ ను జగపతిబాబు కలవాడమే కాకుండా ప్రభాస్ చెప్పిన సలహాతో తన డిప్రెషన్ పోగొట్టుకున్న సంగతి వివరిస్తూ ప్రభాస్ లాంటి గొప్ప హృదయం గల వ్యక్తులను చాల తక్కువగా చూశాను అని అంటున్నాడు. ఇక రాజమౌళి కుటుంబంతో తనకు గల సాన్నిహిత్యాన్ని వివరిస్తూ ఎన్నో అవార్డులు మరెన్నో గౌరవాలు రాజమౌళికి వచ్చినప్పటికీ ఎక్కడా అహంకారం అన్నది అతడి మాటలలో కానీ చేతలలో కాని తనకు కనిపించదు అని అంటున్నాడు..