
బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది జవాన్ మూవీ. మాస్ ప్రేక్షకుల దగ్గర నుంచి క్లాస్ ప్రేక్షకుల వరకు అందరిని ఆకట్టుకుంది అని చెప్పాలి. దీంతో ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా డైరెక్టర్ అట్లీ పేరు వినిపిస్తూ ఉంది. ఇక అట్లీ తర్వాత ప్రాజెక్ట్ ఏంటి అనే విషయంపై కూడా అందరూ చర్చించుకుంటూ ఉంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అట్లీ ఎవరితో సినిమాలు తీయాలనుకుంటున్నాడు అనే విషయం కూడా హార్ట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల ఈ విషయంపై స్పందిస్తూ ఈ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నలుగురు హీరోలతో తనకు సినిమాలు తీయాలని ఉంది అంటూ అట్లీ చెప్పుకొచ్చాడు. ఆ నలుగురు హీరోలు కూడా బాలీవుడ్కు చెందిన వారే కావడం గమనార్హం. జవాన్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఇటీవల సినిమా విజయోత్సవంలో ఒక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, కృతిక్ రోషన్, రణవీర్ సింగ్, రణబీర్ కపూర్ లతో సినిమాలను తీయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. ముందుగా సల్మాన్ రణబీర్ లతో సినిమాలో తీయాలని ఉంది అంటూ తెలిపాడు. అయితే జవాన్ సినిమా విషయంలో దేవుడు ఆశీస్సులు మాపై ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.