సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు  ట్రయాంగిల్ లవ్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నేటి యువత తీరును చెప్పకనే చెప్పింది   దీంతో యూత్ అందరికి సూపర్ గా కనెక్ట్ అయిపోయింది. ఇక చిన్న సినిమాగా వచ్చి ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది అని చెప్పాలి. అచ్చంగా ఈ మూవీలో చూపించిన విధంగానే ప్రస్తుతం రియల్ లైఫ్ లో కూడా జరుగుతుంది అంటూ అందరూ చర్చించుకుంటున్నారు. అయితే అటు ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతున్న బిగ్ బాస్ ఏడవ సీజన్లో హౌస్ లో కూడా బేబీ సినిమా సీన్ రిపీట్ అవుతుందని కొంతమంది చర్చించుకుంటున్నారు. బిగ్బాస్ హౌస్లో అందరూ పవర్ అస్త్ర కోసం పోటీ పడుతుంటే అటు రతిక, పల్లవి ప్రశాంత్ మాత్రం ఇప్పటి లాగానే గిల్లికజ్జాలతో గొడవలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. గత కొన్ని రోజుల నుంచి రతిక, ప్రశాంత్ మధ్య మాటల్లేవు. కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కొన్ని గొడవలు కొన్ని గిల్లికజ్జాలతో ఇద్దరు కలిసి పోయినట్లే కనిపిస్తుంది. ఇలా పల్లవి ప్రశాంత్ తో రతిక కాస్త క్లోజ్ గానే మూవ్ అవుతుంది అని చెప్పాలి. మరోవైపు ప్రిన్స్ యావర్ తో కూడా అటు రాధిక ఏదో స్టోరీ నడుపుతుంది అని ఇక బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది. పల్లవి ప్రశాంత్, రతిక మధ్య గిల్లికజ్జాలు చూసి ప్రిన్స్  నలిగిపోయాడు.


 అయితే కంటెస్టెంట్స్ అందరూ కూడా తనను టార్గెట్ చేసినట్లు అనిపిస్తుంది అంటూ శివాజీ దగ్గర తన బాధను చెప్పుకొని ఏడ్చింది రతిక. ఆ సమయంలోనే పల్లవి ప్రశాంత్ అక్కడికి వచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. కళ్ళలో పాదరసం వస్తుంది అని నవ్వించడానికి ప్రయత్నించాడు. అంతలోనే అక్కడికి ప్రిన్స్ యావర్ వచ్చాడు. రతిక, యావర్ ను మామూలుగా చూడగా అసలు ఎవరు మన మధ్యలో ఎందుకు అన్నాడు. దీంతో ప్రతీక ఏడుపు ఆపేసి నవ్వింది. ఇదంతా చూసిన ప్రేక్షకులు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయ్ అనుకునే లోపే మళ్ళీ గొడవపడటం మొదలుపెట్టాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ లో కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: