సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులకు ఎప్పటికీ ఫేవరెట్ గా నిలిచిపోతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా క్లాసికల్ లవ్ స్టోరీ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలకు అయితే మరింత ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అని చెప్పాలి. ఇక ఆయా సినిమాలలో ఎవరైనా హీరో హీరోయిన్లు కలిసి నటించారు అంటే వారి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అంటే చాలు.. ఆ జోడి ప్రేక్షకులకు ఫేవరెట్ జోడిగా మారిపోతూ ఉంటుంది. ఇక మరోసారి ఆ హీరో హీరోయిన్ కలిసిన నటిస్తే బాగుండు అని అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు.


 ఇక అభిమానులకు ఫేవరెట్ జోడి మరోసారి రిపీట్ అయితే ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఫేవరెట్ జోడి రిపీట్ కాబోతుంది అన్నది తెలుస్తుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. నేటి ఆధునిక సమాజంలో కూడా ఇంకా కులం మతం అనే భావన ఎంతలా పాతుకు పోయింది అన్న విషయాన్ని ఇక ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మూవీలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించారు. ఇక వీరిద్దరి నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి.


 అయితే ఇక వీరిద్దరి కాంబినేషన్ కి కూడా మంచి క్రేజ్ వచ్చిన నేపథ్యంలో మరోసారి ఈ జోడి రిపీట్ కాబోతుంది అన్నది తెలుస్తుంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న 23వ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా ఎంపిక అయిందట. ఈ సినిమాకు డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించబోతున్నారట. కాగా నాగచైతన్య కోసం ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని సిద్ధం చేశాడట చందు మొండేటి.  అయితే ఇక ఎన్నో రోజుల నుంచి లవ్ స్టోరీ కాంబినేషన్ రిపీట్ కావాలని కోరుకుంటున్న ఫాన్స్ కి ఈ విషయం తెలిసి తెగ సంబరపడిపోతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: