
అయితే ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో రెండు ఎలిమినేషన్స్ జరగగా.. కేవలం 12 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ప్రస్తుతం హౌస్ లో కొనసాగుతున్నారు అని చెప్పాలి. అయితే ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ పవర్ అస్త్ర సంపాదించగా ప్రిన్స్ కు పవర్ ఆస్త్ర సంపాదించేందుకు అవకాశం వచ్చింది. అయితే గత ఎపిసోడ్లో ప్రిన్స్ యావర్ పవర్ అస్త్రకి అనర్హుడు అంటూ ప్రకటించగా బిగ్ బాస్ అతనికి మరొక ఛాన్స్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే అతనికి ఒక టాస్క్ పెట్టాడు. గత ఎపిసోడ్లో రెచ్చిపోయిన యావర్ ఓపికకు పరీక్షగా స్టాండ్ పై తలపెట్టి ఇంటి సభ్యులు ఏం చేసినా స్టాండ్ పైనుంచి తల తీయకూడదని బిగ్ బాస్ చెప్తాడు. దీంతో అతను స్టాండ్ పై తలపెట్టి నిలబడగా మిగతా సభ్యులు రతిక, దామిని, టేస్టి తేజ శాడిజం ఏంటో చూపించారు. రతిక అయితే మరింత దారుణంగా ప్రిన్స్ ముఖంపై కోడిగుడ్లు కొడుతుంది. ఇక మరోవైపు ఏకంగా టేస్టీ తేజ ఐస్ మొక్కలు తీసుకొస్తే.. అది యావర్ డ్రాయర్ లో వేస్తుంది రతిక. అంతేకాదు పేడను నోట్లోకి వెళ్లేలా దారుణంగా పూస్తుంది.
ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు అందరూ కూడా షాక్ అవుతారు అని చెప్పాలి. మనందరికీ తెలిసిన సినీ సెలబ్రిటీలలో ఇంతటి శాడిజం ఉందా అని ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతారు. ఒక మనిషిని ఇంత దారుణంగా చిత్రహింసలకు గురిచేస్తారా అని ఎంతో మంది ప్రేక్షకులు తిట్టిపోస్తూ ఉన్నారు అని చెప్పాలి.