స్టార్ హీరోయిన్ రష్మిక ఒకప్పుడు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీ కాగా ఈ మధ్య కాలంలో రష్మికకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు రావడం లేదనే సంగతి తెలిసిందే.రవితేజ రష్మిక కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరసింహారెడ్డి సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. అయితే రవితేజ రష్మిక జోడీ గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ 28 సంవత్సరాలు కావడం గమనార్హం. రవితేజ రష్మిక జోడీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాల్సి ఉంది. దసరా నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం అందుతోంది. ఎలాంటి బ్రేక్స్ లేకుండా ఈ సినిమా షూటింగ్ జరగనుందని తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా అటు రవితేజకు ఇటు గోపీచంద్ మలినేనికి భారీ హిట్ ను అందిస్తుందేమో చూడాల్సి ఉంది. రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ ను అభిమనులు ఎంతగానో ఇష్టపడతారు. రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శీన, బలుపు, క్రాక్ సినిమాలు తెరకెక్కాయి.ఈ మూడు సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. రవితేజ రేంజ్ ను ఈ సినిమా మరింత పెంచడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మాస్ మహారాజ్ రెమ్యునరేషన్ 20 నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రవితేజ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రష్మిక పారితోషికం ప్రస్తుతం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: